విద్యుత్ దుప్పటి వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి

చలికాలంలో వెచ్చదనం కోసం వాడే విద్యుత్ దుప్పట్లు, కంబళ్లు జాగ్రత్తలు పాటిస్తే సురక్షితమే. వీటికి కరెంటు ఖర్చు కూడా తక్కువే. కొనే సమయంలోనే భద్రతా ప్రమాణాలు, రెగ్యులేటరీ కంప్లయన్స్ మార్క్ చూసుకోవాలి. లోపలి వైరింగ్, పరికరాల నాణ్యతను తెలుసుకోవాలి. గట్టిగా మడతపెట్టకుండా చదునుగా లేదా వదులుగా చుట్టి భద్రపరచాలి. దుప్పటిపై బరువులు ఉంచరాదు.
✓ Verified