రియాద్‌పై హూతీల దాడి.. క్షిపణిని కూల్చిన సౌదీ సైన్యం

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా హూతీలు దాడికి పాల్పడ్డారని అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. గురువారం ఉదయం నగరంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించింది. 80 అంతస్తుల పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ టవర్‌కు నష్టం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. హూతీలు రియాద్ దిశగా ప్రయోగించిన క్షిపణిని నేలకూల్చినట్లు సౌదీ సైన్యం కాసేపటికే తెలిపింది.
✓ Verified