పాలమూరు కరవుకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత: కేటీఆర్

పాలమూరు జిల్లాలో కరవు పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో తుమ్మిళ్ల లిఫ్ట్ నిర్మించి ఆర్డీఎస్‌ను రక్షించామని గుర్తుచేశారు. ఆంధ్రా పాలకులను మించి రేవంత్‌రెడ్డి తెలంగాణకు హాని చేశారని ఆరోపించారు. సాగర్ నీళ్లు తరలిపోతుంటే నల్గొండ మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఏపీలో లేని క్రాప్ హాలిడే ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు.
✓ Verified