యశ్ పాటిల్ ఏఐ స్టార్టప్‌కు రూ.40 వేల కోట్ల డీల్

భారత సంతతికి చెందిన యశ్ పాటిల్ అమెరికాలో నెలకొల్పిన ఏఐ స్టార్టప్ ‘అప్లైడ్ కంప్యూట్’ను పాలో ఆల్టో నెట్‌వర్క్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు ఆ సైబర్ సెక్యూరిటీ సంస్థ 4.5 బిలియన్ డాలర్లు (రూ.40 వేల కోట్లకు పైగా) వెచ్చించేలా ఒప్పందం కుదిరింది. 2025 మేలోనే ఈ సంస్థ మొదలైంది. డీల్ పూర్తయిన తర్వాత యశ్ కో-చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.
✓ Verified