కుటుంబాన్ని ట్రోల్ చేస్తే సహించను: రష్మిక మందన్న

సినిమాలతో సంబంధం లేని తన కుటుంబ సభ్యులు, స్నేహితులపై ట్రోలింగ్ చేస్తే సహించబోనని నటి రష్మిక మందన్న తేల్చిచెప్పారు. నటిగా తనను విమర్శించినా, ట్రోల్ చేసినా తట్టుకోగలనన్నారు. విమర్శలతో తాను ఇంకా దృఢంగా తయారవుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘మైసా’ చిత్రంలో డూప్ సాయం లేకుండా 90 అడుగుల ఎత్తు నుంచి తానే స్టంట్ చేశానని వెల్లడించారు.
✓ Verified