వీఎస్ బాబు పాడెకు భుజం ఇచ్చిన సీఎం విజయ్

టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా పాడెకు భుజం ఇచ్చారు. మంత్రులతో కలిసి కొంత దూరం పాడె మోసిన ఆయన, తర్వాత వాహనం వెనుక శ్మశానవాటిక దాకా కాలినడకన వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. అనారోగ్యంతో కన్నుమూసిన బాబుకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.
✓ Verified