పరిషత్ ఎన్నికల్లో 96.4% స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు

పరిషత్ ఎన్నికల్లో కూటమి 96.4 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, కూటమికి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రతి అభ్యర్థిపై ప్రజాభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించామని, ఎన్నికల నిర్వహణకు వార్ రూమ్ పెట్టామని వివరించారు.
✓ Verified