సినిమా పైరసీ ముఠాను పట్టుకున్న తెలంగాణ సైబర్ పోలీసులు

థియేటర్లలో సెల్ఫోన్లతో చిత్రాలను చిత్రీకరించి పైరసీ సైట్లు, టెలిగ్రామ్ ఛానెళ్లలో పెడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఛేదించారు. కర్నూలు వాసులు షేక్ రిజ్వాన్, రాంపోగు అజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో చిత్రం రికార్డింగ్‌కు వీరికి క్రిప్టోకరెన్సీ రూపంలో రూ.20 వేలు అందుతున్నట్లు తేలింది. రామాయణ, సీన్, మహాశక్తి, ఈఎన్ఈ రిపీట్ చిత్రాలు వీరి పైరసీ బారిన పడ్డాయి.
✓ Verified