ఓర్వకల్లులో ఆసియాలోనే అతిపెద్ద పానీయాల ప్లాంట్ ప్రారంభం

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ కేంద్రం ఉత్పత్తి మొదలుపెట్టిందని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో వెల్లడించారు. శంకుస్థాపన జరిగిన 12 నెలల్లోనే రిలయన్స్ ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. ఇక్కడ కాంపా కోలా, పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ తాగునీరు తయారవుతాయని, ఇవి దేశవిదేశాలకు ఎగుమతై అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీ ఇస్తాయని చెప్పారు.
✓ Verified