జాతీయ షూటింగ్లో తెలంగాణ షూటర్ జయేష్ చంద్‌కు వెండి పతకం

తెలంగాణ షూటర్ జె. జయేష్ చంద్ 69వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ మాస్టర్ మెన్ స్కీట్ ఫైనల్లో 27 స్కోరుతో రజతం గెలిచాడు. న్యూఢిల్లీ డాక్టర్ కర్ణి సింగ్ రేంజ్లో శనివారం పోటీ జరిగింది. యూపీకి చెందిన దానిష్ ఖాన్ 29 స్కోరుతో స్వర్ణం, ఢిల్లీ షూటర్ సయ్యద్ హమ్మద్ మీర్ 25తో కాంస్యం పొందారు. తెలంగాణకు చెందిన రాహుల్ రావు 4, చేతన్ రెడ్డి 5, వికార్ అహ్మద్ 6వ స్థానాలు సాధించారు.
✓ Verified