భారత్-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి: సీఈఏ

ఇండియా, అమెరికా దేశాల నడుమ వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు క్రమంగా సడలుతున్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) నాగేశ్వరన్ వెల్లడించారు. డిసెంబర్ మొదట్లోపు రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తే, ఉభయ దేశాల సంబంధాలు మరింత బలపడే వీలుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
✓ Verified