పీఎఫ్ విత్‌డ్రాకు ఈపీఎఫ్‌ఓ కొత్త SWP పథకం

పదవీ విరమణ అనంతరం పీఎఫ్ సొమ్మును దశలవారీగా తీసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్ (SWP)ను ప్రవేశపెట్టింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దీనికి ఆమోదముద్ర వేసింది. ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏటా ఒకసారి నిధులు పొందవచ్చు. ఖాతాలో మిగిలే మొత్తానికి వడ్డీ జమ అవుతుంది. ఎప్పుడైనా పథకం నుంచి బయటకు రావచ్చు. జీవిత భాగస్వామి, నామినీకి కూడా ఈ వెసులుబాటు ఉంటుంది.
✓ Verified