తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి

తెలంగాణలో 2027 ఫిబ్రవరి 24న ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలై మార్చి 20న ముగుస్తాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. రోజూ ఉదయం 9 గంటలకు మొదలయ్యే పరీక్షలు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తవుతాయి. అంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
✓ Verified