పసిడి ధరలు 30% పతనం.. గోల్డ్ లోన్ సంస్థలకు ఇబ్బంది

బంగారం ధరలు జీవనకాల గరిష్ఠం నుంచి 30% దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులు ఆనందపడుతుండగా, ఆభరణాల తనఖాపై అప్పులిచ్చిన సంస్థలు, రుణాలు పొందినవారు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ రుణం-తనఖా నిష్పత్తి (ఎల్‌టీవీ)తో అప్పు తీసుకున్నవారికి బకాయి తీర్చడం గానీ, గడువు పెంచుకోవడం గానీ సులువుగా లేదు.
✓ Verified