నషా ముక్త్ భారత్ యాత్రకు నాగార్జున అండ

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో చేపట్టనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు సినీనటుడు అక్కినేని నాగార్జున మద్దతు ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించగా, యువతను చైతన్యపరిచే ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తానని నాగార్జున చెప్పారు. యాత్ర కోసం రూపొందించిన టీ-షర్టులను కిషన్‌రెడ్డి ఆయనకు అందించారు.
✓ Verified