601 మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు ముగిశాయి

రాష్ట్రంలోని 659 మండల ప్రజాపరిషత్‌లలో 601 చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని ఎస్‌ఈసీ విజయవాడలో ప్రకటించింది. మిగిలిన 58 మండలాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తారు. మన్యం, విశాఖ, కోనసీమ, తూ.గో, ప.గో, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ ఎన్నికలు పూర్తయ్యాయి.
✓ Verified