భారీ భద్రత ఉన్నా భయం వీడలేదు: సల్మాన్ ఖాన్

తన చుట్టూ గట్టి భద్రత ఉన్నా ఇంకా భయం పోలేదని, ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చనే ఆందోళన ఉందని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అన్నారు. కొత్త సినిమా ‘మాతృభూమి’ ప్రమోషన్ కోసం హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్లో ఆయన మాట్లాడారు. సైన్యంలోని జవాన్ల కుటుంబాలు ఎప్పుడూ ఆందోళనలోనే ఉంటాయన్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో ఈ మాటలు అన్నట్లు సమాచారం.
✓ Verified