నగర యువతను వేధిస్తున్న డిస్క్ సమస్యలు

నగరంలోని యువతలో డిస్క్ సంబంధిత ఇబ్బందులు అధికమవుతున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రుల స్పైన్ విభాగాల ఓపీకి రోజూ ఆరేడు మంది యువకులు ఈ సమస్యతో వస్తున్నారు. అధిక బరువులు ఎత్తడం, కఠిన వ్యాయామం, గంటల కొద్దీ కూర్చోవడం, ప్రమాదాల వల్ల డిస్క్‌లు జారుతాయని, జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి కూడా కారణమని వైద్యులు తెలిపారు.
✓ Verified