2070లోనూ భారత్ హిందూ మెజారిటీ దేశమే: ప్యూ అధ్యయనం

ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం మేరకు 2070లో కూడా భారత్‌లో హిందువులే మెజారిటీగా ఉంటారు. 2020లో 79 శాతంగా ఉన్న వారి వాటా 76 శాతానికి పడిపోనుంది. ముస్లింల వాటా 15 నుంచి 20 శాతానికి ఎగబాకనుంది. హిందువులు 129 కోట్లు, ముస్లింలు 33.4 కోట్లు ఉండొచ్చని నివేదిక పేర్కొంది. ముస్లిం జనాభాలో పాకిస్థాన్ తర్వాత భారత్ రెండో స్థానంలో నిలుస్తుందని వెల్లడించింది.
✓ Verified