హైదరాబాద్‌లో డ్రగ్స్ విచ్చలవిడి: కిషన్‌రెడ్డి ఆందోళన

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు యథేచ్ఛగా చేతులు మారుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి యువతే గొప్ప సంపద అని, అలాంటి యువత మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. పంజాబ్ డ్రగ్స్ వల్ల దెబ్బతిన్నదని గుర్తుచేశారు. నగరంలోని ఐటీ ఉద్యోగులు, యువకులు, మేధావులు డ్రగ్స్‌పై పోరాటానికి ముందుకు రావాలని కోరారు.
✓ Verified