డోభాల్‌కు సమన్ల అభ్యర్థన.. నిరాధార దావాలన్న భారత్

గురుపత్వంత్ సింగ్ పన్నూ దావాను నిరాధారమైనదిగా భారత్ కొట్టిపారేసింది. తన హత్యకు భారత అధికారులు పథకం వేశారని పన్నూ అమెరికాలో కేసు వేశారు. దాంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రా మాజీ చీఫ్ సామంత్ గోయల్‌కు దిల్లీ కోర్టు ద్వారా సమన్లు పంపాలని అమెరికా ఫెడరల్ కోర్టు కోరింది. ఇలాంటి దావాలను తాము అంగీకరించబోమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్వాల్ స్పష్టం చేశారు.
✓ Verified