శ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్

శ్రీసత్యసాయి జిల్లా పరిషత్‌కు తొలి ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ పదవిని స్వీకరించారు. నల్లచెరువు నుంచి జడ్పీటీసీగా విజయం సాధించిన ఆయనకు అనేక ఊహాగానాల నడుమ ఈ బాధ్యత లభించింది. కాకినాడలో వైస్ ఛైర్పర్సన్ కేటాయింపుపై టీడీపీ జడ్పీటీసీ పిల్లి అనంతలక్ష్మి అసంతృప్తితో ఉన్నారు. నాయకుల బుజ్జగింపుతో సమావేశానికి హాజరైనా, ప్రమాణం చేయకుండానే ఆమె వెళ్లిపోయారు.
✓ Verified