శ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులు

తిరుమల శ్రీవారి ఫిబ్రవరి ఆర్జిత సేవల ఈ-డిప్ నమోదు పూర్తయింది. అందుబాటులో ఉన్న 7,744 టికెట్ల కోసం నాలుగు ప్రధాన సేవలకు మొత్తం 32,25,228 మంది భక్తులు పోటీ పడ్డారు. సుప్రభాతానికి 8,75,506, తోమాలకు 8,00,013, అర్చనకు 7,90,332, అష్టదళ పాదపద్మారాధనకు 7,59,377 దరఖాస్తులు అందాయి. ఎంపికైనవారు గడువులోపు డబ్బు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలి.
✓ Verified