మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులు

ఏపీలో రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లో 3,141 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవడంతో 4 మేయర్, 19 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులు, 969 డివిజన్లు, వార్డులకు బరి ఖరారైంది. 41 వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మేయర్, ఛైర్‌పర్సన్ పదవుల్లో ఏదీ ఏకగ్రీవం కాలేదు. ఈ నెల 26న పోలింగ్, 30న కౌంటింగ్ ఉంటుంది.
✓ Verified