కారు ల్యాంప్ వెనుక దాచిన రూ.3.83 కోట్ల బంగారం పట్టివేత

కోల్కతా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తీసుకొస్తున్న రూ.3.83 కోట్ల విలువైన 25 బంగారు బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న ఓ కారును ఆపి అందులోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించగా ల్యాంప్ వెనుక ఏర్పాటు చేసిన రహస్య అరలో పుత్తడి బయటపడింది.
✓ Verified