తిరుమలలో సర్వదర్శనానికి 4 గంటలు, హుండీకి రూ.4.28 కోట్లు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల తాకిడి కొనసాగుతోంది. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులు సర్వదర్శనం పొందడానికి దాదాపు 4 గంటలు పడుతోంది. 6 కంపార్ట్మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. శుక్రవారం స్వామివారిని 56,695 మంది దర్శించుకున్నారు. వీరిలో 24,786 మంది తలనీలాలు ఇచ్చారు. హుండీలో రూ.4.28 కోట్లు జమయ్యాయి.
✓ Verified