హను-మాన్ ఫ్రాంచైజీలో రెండు సీక్వెల్స్.. వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం

‘హనుమాన్ 2 - ది రైజ్ ఆఫ్ వానరాస్’ పేరుతో కొత్త సినిమాను ‘హను-మాన్’ నిర్మాతలైన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించనుండగా, వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ రూపొందుతున్నట్లు గతంలోనే వెల్లడైంది. ఒకే ఫ్రాంచైజీలో రెండు సీక్వెల్స్ రావడం సినీ అభిమానుల్లో ఆసక్తితో పాటు అయోమయానికీ దారితీస్తోంది.
✓ Verified