భాజపాలో చేరిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భాజపా గూటికి చేరారు. పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీకి ఆయనను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సూచనల ప్రకారం ఈ బాధ్యత అప్పగించారు. దీనికి ముందు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్పాల్ మౌర్యతో చాహల్ భేటీ అయ్యారు.
✓ Verified