కడప జిల్లాలో నామినేషన్ కేంద్రాల వద్ద తెదేపా-వైకాపా ఘర్షణ

కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట నామినేషన్ కేంద్రంలో తెదేపా, వైకాపా వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఎర్రగుంట్ల మండలం కలమల్ల కేంద్రం వద్ద కూడా సర్పంచి ఎన్నికల నామినేషన్లపై ఇరు పార్టీల వర్గీయులు గొడవకు దిగారు. అక్కడ పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
✓ Verified