టైమ్100 నెక్స్ట్ జాబితాలో అనిరుధ్.. అల్లు అర్జున్ అభినందనలు

టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన ‘టైమ్100 నెక్స్ట్ ఇండియా-2026’ జాబితాలో స్థానం పొందిన సంగీత దర్శకుడు అనిరుధ్‌ను హీరో అల్లు అర్జున్ అభినందించారు. అనిరుధ్‌ను గొప్ప సంగీత మేధావిగా అభివర్ణించిన బన్నీ, ఆయన పాటలు ప్రపంచమంతటా అభిమానులను తెచ్చిపెట్టాయని ప్రశంసించారు. అనిరుధ్ ఫ్యాన్స్‌లో అగ్రస్థానం తనదేనని సరదాగా అన్నారు.
✓ Verified