రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేశ్ వివరణ

నటి రాధికా ఆప్టే వ్యాఖ్యల చుట్టూ రేగిన వివాదంపై హీరోయిన్ కీర్తి సురేశ్ మాట్లాడారు. మేనమామతో వివాహం జరిగే సినిమా పాత్రపై రాధిక ప్రస్తావించినప్పుడు మొదట తనకు అర్థం కాలేదని, ఆ తర్వాతే అది దక్షిణాది ఆచారానికి సంబంధించిందని గ్రహించానని చెప్పారు. తాను మన సంస్కృతిని ఎన్నడూ కించపరచనని, ఉత్తర భారతీయులకు మన సంప్రదాయాలు తెలియకపోవచ్చని పేర్కొన్నారు.
✓ Verified