ఇండిగో ఉద్యోగిని హత్య కేసు: స్నేహితుడి భార్య సహా నలుగురు అరెస్టు

ఇండిగో ఉద్యోగిని వర్షా తుర్కర్ హత్య కేసులో నితేశ్ అగర్వాల్ భార్య మోనా అగర్వాల్‌తో పాటు మరో ముగ్గురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. భర్తతో వర్షకు వివాహేతర సంబంధం ఉందనే కారణంతో మోనా సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. స్నేహితుడు నితేశ్తో బయటకు వెళ్లిన వర్ష, అడవిలో అనుమానాస్పదంగా మృతి చెందారు.
✓ Verified