గంగపై ‘నీతీశ్ సేతు’ను ప్రారంభించిన మోదీ

బిహార్లో గంగా నదిపై కట్టిన ఆరు లేన్ల ‘నీతీశ్ సేతు’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 9.76 కిలోమీటర్ల ఈ వంతెన వైశాలి జిల్లా బిదుపూర్ బ్లాక్ నుంచి పట్నా శివారు కచ్చి దర్గా వరకు అనుసంధానం కల్పిస్తుంది. మాజీ సీఎం నీతీశ్ కుమార్ పాలనలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు కావడంతో ఆయన పేరు పెట్టారు. అంతకుముందు పట్నా విమానాశ్రయంలో మోదీని నీతీశ్ స్వాగతించారు.
✓ Verified