జడ్జికి బదులు ఒవైసీకి పోలీసుల సెల్యూట్

సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమర్పించాల్సిన గౌరవ వందనాన్ని ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ పోలీసులు పొరపాటున హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి అందించారు. జడ్జి రాకముందే ఒవైసీ సర్క్యూట్ హౌస్కు రావడంతో, ఆయననే న్యాయమూర్తి అనుకుని పోలీసులు సెల్యూట్ చేశారని సమాచారం. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన ఘటనపై సిటీ ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
✓ Verified