రఫేల్ విమానాల అదృశ్యం కథనం అవాస్తవం: మాజీ అధికారి

భారత్ ఏ యుద్ధవిమానాన్నీ కోల్పోలేదని ఐఏఎఫ్ మాజీ అధికారి నర్మదేశ్వర్ తివారీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ వేళ దేశానికి చెందిన 4 రఫేల్ విమానాలు కనిపించకుండా పోయాయని, మన వద్ద 36కు బదులు 32 మాత్రమే ఉన్నాయని బ్రిటిష్ మేగజైన్ ఫ్లైట్‌గ్లోబల్ రాసిన కథనాన్ని ఆయన తోసిపుచ్చారు. ఆ లెక్కలు నిజం కావని, గతేడాది నివేదికలోనూ ఆ పత్రిక 35 విమానాలంటూ తప్పు సమాచారం ఇచ్చిందని తెలిపారు.
✓ Verified