శబరిమల యాత్రకు వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి

అయ్యప్ప దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడూ ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవాల్సిందేనని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. శబరిమలలో రద్దీ నియంత్రణకు రూపొందించిన సూచనలను వారు ఏపీ డీజీపీ కార్యాలయానికి పంపారు. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికే దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. యాత్రికులు మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరారు.
✓ Verified