మొబైల్ చూస్తూ భోజనం.. అతిగా తినే ప్రమాదం

ఫోన్ తెరపై దృష్టి పెట్టి తింటే అవసరానికి మించి ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కడుపు నిండిందన్న సంకేతాలను మెదడు సరిగా గుర్తించకపోవచ్చు. చాలామంది వేగంగా తినేసి, ఆహారాన్ని సరిగా నమలరు. దీనివల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు రావచ్చు. ఆహారం రుచి, వాసన, రంగు, ఆకృతిని ఆస్వాదించడమూ తగ్గుతుంది.
✓ Verified