బాలకృష్ణకు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం? ప్రచారం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చే విశిష్ట పురస్కారానికి నందమూరి బాలకృష్ణ ఎంపికైనట్లు ప్రచారం సాగుతోంది. సినిమా రంగంలో కృషి, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్గా ఆయన సేవలను పరిగణనలోకి తీసుకుని పేరు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దీనికి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
✓ Verified