తిరుప్పరకుండ్రం దీపం: నవంబర్ 24న ఒక్కరోజే సుప్రీం అనుమతి

తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించేందుకు నవంబర్ 24న ఒక్కరోజు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులపై స్టే విధించింది. దేవస్థానం ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకే కొండపైకి వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొంది. అవసరమైతే భద్రత కల్పించాలని ఆదేశించింది. దీపం స్థలంపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది.
✓ Verified