6.3 కేజీల బంగారంతో శ్రీరామకథకు బిహార్ గోల్డ్‌మ్యాన్

సుమారు రూ.10 కోట్ల విలువైన 6.3 కేజీల బంగారు నగలు ఒంటిపై వేసుకుని బిహార్‌కు చెందిన గోల్డ్‌మ్యాన్ ప్రేమ్‌కుమార్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లోని కుండాలో సందడి చేశారు. రాజకీయ నేత రాజా భయ్యా ఏర్పాటు చేసిన శ్రీరామకథకు గొలుసులు, బ్రేస్లెట్లతో వచ్చిన ఆయనతో ఫొటోలకు స్థానికులు ఎగబడ్డారు. ఈ దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
✓ Verified