వాట్సాప్ గ్రూపు పరిమితి 1,500కు పెంపు

వాట్సాప్ ఒక గ్రూపులో చేర్చుకునే సభ్యుల సంఖ్యను 1,500కు పెంచుతోంది. మొదట 256గా ఉన్న ఈ పరిమితి తర్వాత 512కి, అనంతరం 1,024కి చేరింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఈ సదుపాయం విడతల వారీగా లభిస్తోంది. ప్రస్తుత గ్రూపులకూ కొత్త పరిమితి దానంతటదే అమలవుతుంది. ఇందుకోసం అడ్మిన్లు సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులూ చేయనక్కర్లేదు.
✓ Verified