సిగ్నల్ యాప్‌లో స్క్రీన్‌షాట్‌లకు పరిమితులు

ఏఐ ఏజెంట్లు స్క్రీన్‌షాట్‌ల సాయంతో వ్యక్తిగత సందేశాలను చదివే అవకాశం లేకుండా మెసేజింగ్ యాప్ సిగ్నల్ స్క్రీన్‌షాట్‌లపై పరిమితులు తెచ్చింది. యూజర్ల ప్రైవేట్ చాట్స్‌లోకి ఏఐ వ్యవస్థలు అనుమతి లేకుండా చొరబడకుండా ఆపడమే లక్ష్యమని తెలిపింది. డేటా భద్రతపై భయాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.
✓ Verified