ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకులు.. దశలవారీ పెట్టుబడే మేలు

ఆర్బీఐ అక్టోబరులో రెపో రేటును 0.25 శాతం పెంచింది. దీంతో బ్యాంకులు కొన్ని కాలపరిమితుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని సవరించాయి. అయితే అన్నింటిపై ఒకేసారి పెంచలేదు. ఇప్పుడే డిపాజిట్ చేయాలా, ఆగితే ఎక్కువ వడ్డీ వస్తుందా అనే అయోమయం డిపాజిటర్లలో ఉంది. డబ్బంతా ఒకేసారి దీర్ఘకాల ఎఫ్డీలో పెట్టకుండా విడతలుగా పెట్టడం ఉత్తమం.
✓ Verified