తెలంగాణలో భూముల రీసర్వేకు ఆరు దశల విధానం

తెలంగాణలో భూముల రీసర్వే ఆరు దశల్లో జరగాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి అధికారుల కోసం సీసీఎల్‌ఎ కమిషనర్ లోకేశ్ కుమార్ ఈ మేరకు మార్గదర్శకాల ఉత్తర్వులు ఇచ్చారు. సర్వేకు 4 రోజుల ముందుగానే రైతులకు నోటీసులు అందించాలి. సర్వే ముగిశాక భూమి విస్తీర్ణం వివరాలను రైతులకు చెప్పాలి. హైదరాబాద్ తప్ప మిగిలిన జిల్లాల కలెక్టర్లు వీటిని అమలు చేయాలని ఆదేశించారు.
✓ Verified