భరిణికంలో పోలీసులు పల్లె నిద్ర
పరవాడ మండలంలోని వెన్నెలపాలెం, పరవాడ గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. భరణికంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్లు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
✓ Verified