గుమ్మ పంచాయతీలో 8వ వార్డు ఏకగ్రీవ ఎన్నిక
అనంతగిరి మండలం గుమ్మా గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డు సభ్యురాలిగా బిడ్డ రాధా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డు నుండి నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఆమె ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల అధికారులు ఆమె ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి, వార్డు సమస్యల పరిష్కారానికి ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా గ్రామస్తులు మరియు పెద్దలు ఏకాభిప్రాయంతో ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బిడ్డ రాధా గారు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న వార్డు ప్రజలకు, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
✓ Verified