గుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నిక
అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికల అధికారులు ఆయన ఏకగ్రీవ ఎన్నికను ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి, వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన గ్రామస్తులు, మహిళలు, పెద్దలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలిపినట్లు స్థానికులు పేర్కొన్నారు.
✓ Verified