పెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్ర
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఐ ఆదేశాల మేరకు రాంబిల్లి పోలీసుల ఆధ్వర్యంలో పెద్దకవలాపల్లి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై ఎన్నికల నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్సై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
✓ Verified