23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్రగుమ్మ పంచాయతీలో 8వ వార్డు ఏకగ్రీవ ఎన్నికకొండూరులో వైసీపీ నేత ఇంట్లో 1,341 మద్యం బాటిళ్లు స్వాధీనంనేడు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక

LIVEరాజకీయాలు

గాంధీ భవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే శంకర్

తంగళ్ళపల్లిరచన CHERUKUPALLY RAKESHధృవీకరించిన Newsdash రిపోర్టర్, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్, రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నూతన కాంగ్రెస్ ఇంచార్జ్ బీఎం సందీప్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, నాయకులు, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తంగళ్ళపల్లి

మరిన్ని →
newsdash

ఎల్లారెడ్డిపేటలో రేణుక ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరైన సెస్ చైర్మన్

నిన్నటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణం, కార్యక్రమ నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి ·
newsdash

13వ వార్డులో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన కౌన్సిలర్

షాద్‌నగర్ మున్సిపాలిటీ 13వ వార్డులో మహిళా కౌన్సిలర్ రిజ్వానా ముబారక్ అలీఖాన్ ఆధ్వర్యంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ హాజరయ్యారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కౌన్సిలర్ సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

తంగళ్ళపల్లి ·