పంబా నదిలో దుస్తులు వదలొద్దు: తెలుగు భక్తులకు కేరళ వినతి

శబరిమలకు వెళ్లే ఏపీ, తెలంగాణ అయ్యప్ప భక్తులు పంబా నదిలో బట్టలు వదిలిపెట్టవద్దని కేరళ ప్రభుత్వం, ఆలయ బోర్డు కోరాయి. ఈ విషయంలో భక్తులకు అవగాహన కల్పించాలంటూ రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు పంపాయి. అలా చేయాలని ఏ శాస్త్రమూ చెప్పలేదని తెలిపాయి. వందల ట్రక్కుల దుస్తులతో నది కలుషితమవుతోందని కేరళ అధికారులు ఆందోళన చెందారు.
✓ Verified